Thursday, September 21

Pawan Tholiprema sequel with Sai Dharam Tej

Pawan Kalyan had a big hit with his film ‘Tholiprema’ and made him a youthful, family Audience and Ladies. KSRamaravu is producing Mega nephew Sai Dharam Tej, who is currently busy with career and is doing a big role in the creative commercial banner of his big brother Chiranjeevi Megastar.


Karunakaran has not got any success after ‘Tholiprema’. He’s a happy and excited film. He did not repeat Nitin ‘for the sake of the little’. Prior to that, Ram made the film because it did not play well. Ram and Shravanthi Ravi Kishore have also left the subject after the two films. Now he is going to do the same story with KSRamaravu as Sai Dharam tej hero.


Karunakaran says that the film is just love and not like friends and family emotions. Karunakaran Hint has given this film a new film to be the sequel to the film ‘Tholiprema’. The film is also directed by BVS Ravi is directed by jawan. The film will be delayed and the shooting will be delayed.

పవన్‌కళ్యాణ్‌కి తన చిత్రం ‘తొలిప్రేమ’తో పెద్ద హిట్‌ ఇచ్చి ఆయన్ను యూత్‌ని, ఫ్యామిలీ ఆడియన్స్‌కి, లేడీస్‌కి బాగా దగ్గర చేసింది కరుణాకరనే. కాగా ఆయన ప్రస్తుతం కెరీర్‌పరంగా ఇబ్బందుల్లో ఉన్న మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌తో కె.యస్‌.రామారావు నిర్మాగా, తన పెద్ద మావయ్య చిరంజీవి మెగాస్టార్‌ కావడంలో ఎంతో తోడ్పడిన క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బేనర్‌లో చిత్రం చేస్తున్నాడు.
ఈ చిత్రం గురించి చెప్పాలంటే కరుణాకరన్‌కి ‘తొలిప్రేమ’ తర్వాత అంతటి హిట్‌ మరలా రాలేదు. ఆయన తీసిన ‘ఉల్లాసంగా.. ఉత్సాహంగా’ చిత్రం బాగా ఆడింది. ఇక నితిన్‌తో చేసిన ‘చిన్నదానా నీ కోసం’ తర్వాత ఆయన మరలాచిత్రం చేయలేదు. దానికి ముందు రామ్‌తో చేసిన ‘ఎందుకంటే ప్రేమంట’ చిత్రం సరిగా ఆడలేదు. ఈరెండు చిత్రాల తర్వాత ప్రస్తుతం సాయిధరమ్‌తేజ్‌తో చేస్తున్న సబ్జెక్ట్‌ని రామ్‌, స్రవంతి రవికిషోర్‌లు విని కూడా వదిలేశారు. ఇప్పుడు ఆయన అదే కథను కె.యస్‌.రామారావుతో సాయిధరమ్‌తేజ్‌ హీరోగా చేయనుండటం విశేషం.
ఇక ఈ చిత్రంలో కేవలం లవ్‌ మాత్రమే కాకుండా ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ ఎమోషన్స్‌వంటి వన్నీ ఉంటాయని కరుణాకరన్‌ చెబుతున్నాడు. ఇక ఈ చిత్రం మొత్తం మీద చెప్పాల్సి వస్తే తాను తీసిన ‘తొలిప్రేమ’కి కొనసాగింపుగా ఈ నూతన చిత్రం ఉంటుందని కరుణాకరన్‌ హింట్‌ ఇచ్చాడు. మరి ఈ చిత్రం కూడా ఆ లెవల్లో తేజూకి హిట్‌ ఇస్తుందో లేదో చూడాలి.. ఇక తేజు ప్రస్తుతం రచయిత బి.వి.ఎస్‌.రవి దర్శకత్వంలో ‘జవాన్‌’ చిత్రం చేస్తున్నాడు. రీషూట్‌ జరుపుకోవాల్సి ఈ చిత్రం షూటింగ్‌ ఆలస్యమవుతుందని అంటున్నారు.

%d bloggers like this: