Thursday, September 21

కథ అడ్డం తిరిగింది.. నిఖిల్ పెళ్లి క్యాన్సిల్!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ మ్యారేజ్ గురించి షాకింగ్ న్యూస్. ఓ బిజినెస్‌మేన్ కూతురు తేజస్వినితో వివాహం చేసుకొని 
తన బ్యాచిలర్ లైఫ్‌కి గుడ్ బై చెప్పనున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాదు అక్టోబర్ ఒకటిన పెళ్లి చేసేందుకు 
ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు వార్తలొచ్చాయి.

సీన్ కట్ చేస్తే.. నిఖిల్– తాను చేసుకోబోయే అమ్మాయి జాతకాలు కలవలేదని, దీంతో ఇరు కుటుంబాలు వివాహాన్ని రద్దు చేసినట్టు ఫిల్మ్‌నగర్ సమాచారం. దీనిపై అఫీషియల్ ప్రకటన రావాల్సివుంది. వధూవరులు ఇష్టపడితే పేర్లు మార్చి మ్యారేజ్ చేస్తారుకానీ, అంతా ఓకే అయి ఇప్పుడు క్యాన్సిల్ చేయరన్నది మరికొందరి మాట. మొత్తానికి ఈ గాసిప్స్‌పై నిఖిల్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

%d bloggers like this: