Thursday, September 21

మరో వివాదంలో ‘అర్జున్ రెడ్డి’ ఫిల్మ్!

భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘అర్జున్ రెడ్డి‘ ఫిల్మ్‌కి మరో వివాదం తోడైంది. ఈ సినిమా స్టోరీ తన వ్యక్తిగత అనుభవాల ఆధారంగా రెడీ చేసినదని, ఆ కథ తనదేనంటూ ఖమ్మంకు చెందిన దర్శకుడు నాగరాజు అంటున్నాడు. దీనికి సంబంధించి దర్శక, నిర్మాతలకు నోటీసులు కూడా పంపాడు.

గతంతో తాను తెరకెక్కించిన ‘ఇక సె..లవ్’ స్టోరీతోనే యథాతథంగా తెరకెక్కించారన్నది ఆయన ఆరోపణ. వెంటనే ప్రదర్శనను నిలిపివేయాలని, తన అనుమతి లేకుండా తెరకెక్కించినందుకు రూ. 2 కోట్ల నష్ట పరిహారం ఇవ్వాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నాడు. దీనిపై అర్జున్ రెడ్డి మేకర్స్ ఏమంటారో చూడాలి.

 

 Arjun Reddy Deatils

%d bloggers like this: