“గుండు హనుమంత రావు” గురించి ఈ షాకింగ్ నిజాలు తెలుస్తే కన్నీళ్లాగవు..భార్య, కూతురు చనిపోయి, కొడుకు ఉద్యోగం!

0
8


దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత సినిమా పరిశ్రమ వారికి చాలా చక్కగా సూట్ అవుతుంది..నిజమేనండీ అవకాశాలు ఉన్నప్పుడే వాటిని వినియోగించుకోవాలి..సంపాదించుకోవాలి..ఆ సంపాదనని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది కూడా.. సినిమా వాళ్ల గురించి మన ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే వాళ్లకేం బాగా సంపాదించుకుంటారు..చాలా విలాసాలతో ఉంటారు అనుకుంటాం..కానీ అందరి పరిస్థితి అలా ఉండదు..

ఆనాటి నటులు సావిత్రి,రాజబాబు,సూర్యకాంతం ల దగ్గరి నుండి చూస్తూ వస్తున్నాం ..సంపాదించిందంతా దాన దర్మాల పేరుతో పొగొట్టుకుని చివరి నిమిషంలో పైసా లేకుండా దీనావస్థలో పోయిన వారి గురించి..ఇప్పుడు గుండు హనుమంతురావు పరిస్థితి అదే..ఇప్పటివరకూ ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నటించి మనల్ని మెప్పించారు గుండు హనుమంతురావు..అమృతం సీరియల్లో అంజి క్యారెక్టర్లో కూడా మనల్ని అలరించారు.తన నటనతో బాగానే సంపాదించారు..కాకపోతే తన భార్య,కూతురు చనిపోవడంతో కొద్దిగా మానసికంగా కృంగిపోయిన హనుమంతురావు తన ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నారు..

అప్పటికే సంపాదించిందంతా కొడుకు విదేశాల్లో చదువుకి వినియోగంచేశారు..ఇక చేసేదేం లేక ,తన తండ్రిని చూసుకునే వారు లేక ఆ కొడుకు కూడా విదేశాల నుండి వచ్చి తండ్రి దగ్గరే ఉంటూ తననే చూసుకుంటున్నాడు..అటు కొడుకు ఉద్యోగం పోయింది..ఇటు ఈయన ఆరోగ్యం పాడైంది..చేతిలో డబ్బులకు కష్టంగా ఉన్నారు..ఇవన్నీ కూడా ఆయనే స్వయంగా ఇటీవల ఆలి యాంకర్ గా వస్తున్న ఒక ప్రోగ్రామ్ లో చెప్పారు..

దీంతో చలించిపోయిన ఆలి… గుండు హనుమంతురావు కొడుక్కి ఉద్యోగం ఇప్పించడమే కాదు..తన ఆరోగ్యానికి అవసరమైన వైధ్య ఖర్చులు భరిస్తానని మాటిచ్చారు…ఒకప్పుడు తోటి నటుడి పట్ల ఆలి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు..ఆలి,గుండు హనుమంతురావ్ కలిసి నటించిన యమలీల సినిమా సూపర్ హిట్ అనే విషయం మనకు తెలిసిందే..

watch video here:

The post “గుండు హనుమంత రావు” గురించి ఈ షాకింగ్ నిజాలు తెలుస్తే కన్నీళ్లాగవు..భార్య, కూతురు చనిపోయి, కొడుకు ఉద్యోగం! appeared first on Ap2tg Telugu.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here